ఆలయం విశిష్టత:
చరిత్రలో చిరకాలం నిలిచిపోయేలాగా కొన్ని దేవాలయాలను నిర్మించారు కొందరు అటువంటి దేవాలయాలలో ఒకటి బేలూరు చెన్నకేశవ స్వామి దేవాలయం ఒకటిగా చెప్పుకోవచ్చు , 12 వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయాన్ని విష్ణువర్ధన్ అనే రాజు 1117 CE లో నిర్మించాడు. ఈ దేవాలయం కర్ణాటక లోని హాసన్ జిల్లాలోని యాగాచి నది ఒడ్డున ఉంది ఒకపుడు ఈ ప్రాంతాన్ని వేలాపూరు అనే పిలిచేవారు ఇప్పుడు ఈ ప్రాంతాన్ని బేలూరు గా పిలవబడుతుంది. బెంగుళూరు కు సుమారు 200km దూరంలో ఉంది. ఈ దేవాలయాన్ని నిర్మించడానికి 103 సంవత్సరాలు పట్టింది ఈ ఆలయం నిర్మాణం పూర్తి అవడానికి విష్ణువర్ధన్ రాజు యొక్క మూడు తరాలకు పైగా శ్రమించారు.
ఆలయం ప్రత్యేకతలు:
ఈ ఆలయం విష్ణు అవతారం అయిన చెన్నకేశవ స్వామి కి అంకితం చేయబడింది, ప్రధానంగా చెప్పాలి అంటే ఈ ఆలయం యొక్క గాలి గోపురం , రకరకాల శిల్పాలు, శాసనాలు, సంగీతకారులు మరియు నృత్యకారులు చిత్రాలు ప్రత్యేకమైనవి, రామాయణం మహాభారతంలోని అనేక శిల్పాలను ఇక్కడ మనం చూడవచ్చు ఆలయం నిర్మాణంలో మృదువైన సున్నపు రాయిని ఉపయోగించారు. ముఖ్యంగా ఈ ఆలయంలో దర్పమమ్ సుందరి , భస్మం మోహిని శిల్పాలు ప్రత్యేక ఆకర్షణంగా ఉంటాయి అలాగే ఆలయం మరో ప్రత్యేకత 42 అడుగుల మహా స్థంభం దీన్ని బేలూరు గ్రావిటీ స్థంభం అంటారు ఈ స్థంభం ప్రత్యేకత ఏమిటంటే ఒకవైపు నేలకు తాకి ఉండదు మూడు వైపుల మాత్రమే ఆదారంగా నిలిచి ఉంటుంది. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత తనంతట తానూ తిరిగే పెద్ద రాతి స్థంభం ఉంది , 42 అడుగుల ధ్వజస్తంభం ఎటువంటి ఆధారం లేకుండా నిలబడి ఉంటుంది.
ఆలయంలో చూడవలసినవి:
- 42 అడుగుల ధ్వజస్తంభం
- దర్పణ సుందరి
- నృత్యకారులు చిత్రాలు
- ఖగోళ చిత్రాలు
- పుష్కరణి (మెట్ల బావి) - (గోపురానికి కుడి వైపు)
- వింధ్య గిరి , చంద్ర గిరి కొండలు
- హళిబేడు (15km from బేలూరు)
ఆలయం దర్శనం వేళలు:
ఉదయం - 7.00 am – 1.00 pm
సాయంత్రం - 2.00 Pm – 8.00 Pm
బేలూరు చెన్నకేశవ ఆలయం చిరునామా :
బేలూరు శ్రీ చెన్నకేశవ దేవాలయం, దేవాలయం మార్గం, బేలూరు, కర్ణాటక - 573115, ఇండియా.
Click: Location Map
ఆలయం చేరుకోవడానికి మార్గాలు:
బస్సు మార్గం : బెంగుళూరు మేజిస్ట్రిక్ బస్సు స్టాండ్ (217km), మంగళూరు (165km), మైసూర్ (154km)
రైలు మార్గం : Hassan Railway Station (40 Kms to beluru)
By Air Nearest Airport: Mangalore - Mangalore Airport (174 Kms)
0 Comments