భారతదేశంలో రతన్ టాటా గారి గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు, భారతదేశంలో ఒక గొప్ప వ్యాపారవేత్తగా రతన్ టాటా గారు వేరు వేరు రంగాలలో ఎన్నో సంస్థలు నిర్మించి విజయవంతంగా రానిస్తున్నారు. ఇప్పటి వరకు 30 కు పైగా సంస్థలు ఉన్నాయి. రతన్ టాటా గారి అసలు పేరు రతన్ నవల్ టాటా 28 December 1937 జన్మించిన రతన్ టాటా గారు ఇప్పుడు టాటా సన్ సంస్థకు చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇంతకముందు టాటా గ్రూప్ కు చైర్మన్ గా 1990 - 2012 వరకు అలాగే 2016 - 2017 వరకు ఇంటెరిమ్ చైర్మన్ గా సేవలు అందించాడు, ఇప్పుడు టాటా ఛారిటబుల్ ట్రస్టుకు అధిపతిగా కొనసాగుతున్నాడు.
టాటా గ్రూప్ సంస్థలో ఉన్న 4 సంస్థల నుంచి రతన్ టాటా గారికి ఎక్కువ లాభాలు తెచ్చిపెడుతున్నాయి వాటాలో మొదటిది
1) టాటా స్టీల్ (TATA STEEL)
టాటా స్టీల్ కంపెనీ భారతదేశంలోని అతి పెద్ద స్టీల్ తయారు చేసే కంపెనీ లో మొదటిది, సుమారు 26 దేశాలకు పైగా స్టీల్ ని సరఫరా చేస్తుంది, ఈ కంపెనీ లో 80500 మందికి పైగా ఉంద్యోగులు పని చేస్తున్నారు. 2022 ప్రకారం టాటా స్టీల్ ప్రతి ఏటా 40,154 కోట్లు లాభాలని టాటా గ్రూప్ కి తెచ్చిపెడుతుంది.
ప్రస్తుతం దీని షేర్ ధర జాతీయ మార్కెట్ లో : ₹115 గా ఉంది
2) టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (TCS)
భారతదేశంలోని ఐటీ సర్వీసులు అందిస్తున్న సంస్థలలో మొదటిది టాటా కన్సల్టెన్సీ సర్వీస్ సంస్థ సుమారు 46 దేశాలలో
149 ప్రధాన ప్రదేశాలలో పనిచేస్తుంది ఈ సంస్థ. 2022 గ్లోబల్ నివేదిక ప్రకారం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ రెండొవ అతి పెద్ద ఐటీ సంస్థగా నిలిచింది. ప్రస్తుతం 2023 ప్రకారం 614,795 మందికి పైగా ఉంద్యోగులు ఈ సంస్థలో పని చేస్తున్నారు. 2022 ప్రకారం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ప్రతి ఏటా 38,327 కోట్లు లాభాలని టాటా గ్రూప్ కి తెచ్చిపెడుతుంది.
ప్రస్తుతం దీని షేర్ ధర జాతీయ మార్కెట్ లో : ₹3450 గా ఉంది.
3) టాటా టైటాన్ (TITAN)
టైటాన్ కంపెనీ అనేది అందరికి తెలిసినదే ఈ సంస్థ గడియారాలు, కళ్లజోడు మరియు ఫ్యాషన్ వంటి ఉత్పత్తులను తయారుచేస్తుంది, ఇది టాటా గ్రూప్ కు అనుబంధ సంస్థ, fasttrack తో గడియారాలు, తనిష్క్‌తో ఆభరణాలు, టైటాన్ ఐప్లస్‌తో కళ్లజోడు స్టోర్స్ ప్రారంభించింది. 2022 ప్రకారం టైటాన్ కంపెనీ ప్రతి ఏటా 2173 కోట్లు లాభాలని టాటా గ్రూప్ కి తెచ్చిపెడుతుంది.
ప్రస్తుతం దీని షేర్ ధర జాతీయ మార్కెట్ లో : ₹3000 గా ఉంది.
4) టాటా పవర్ (TATA POWER)
టాటా పవర్ కంపెనీ 2002 లో పవర్ ఉత్పత్తులను ప్రారంభించింది, ఢిల్లీ లోని NCT గవెర్నమెంట్ తో కలిసి ఈ వెంచర్ని మొదలుపెట్టింది ఈ వెంచర్లో 51% మెజారిటీ వాటా ఈ సంస్థ కలిగి ఉంది, జూన్ 2022 నాటికి దాదాపు 2115 MW గరిష్ట గా ఉంది. అలాగే భారతదేశంలో అనేక ప్రదేశాలలో టాటా పవర్ ఛార్జింగ్ పాయింట్లను నిర్మిస్తుంది. 2022 ప్రకారం టాటా పవర్ కంపెనీ ప్రతి ఏటా 1741 కోట్లు లాభాలని టాటా గ్రూప్ కి తెచ్చిపెడుతుంది.
ప్రస్తుతం దీని షేర్ ధర జాతీయ మార్కెట్ లో : ₹230 గా ఉంది.
0 Comments