ఇప్పుడు ప్రతి ఇంట్లో కూరగాయలు కట్ చేసేందుకు చాపింగ్ బోర్డులు వాడుతున్నాం. హోటళ్లలో కూడా వీటిపైనే కూరగాయలు కట్ చేస్తున్నారు. మార్కెట్లో ఎక్కువగా ప్లాస్టిక్ బోర్డులు లభిస్తుండటంతో తక్కువ ధరకు వస్తున్నాయని ముప్పును కొని తెచ్చుకుంటున్నాం. ప్లాస్టిక్ బోర్డులపై కూరగాయలు, పండ్లు కట్ చేసినప్పుడు చాకులు కొంచెంకొంచెంగా ప్లాస్టిక్‌నూ కట్ చేస్తాయి. కనిపించనంత సన్నగా ఉండే ఇవి కూరగాయల నుంచి మన శరీరంలోకి వెళ్తాయి. అంతేకాదు ప్లాస్టిక్ బోర్డుల వల్ల దానిమీద బ్యాక్టీరియా కూడా బాగా వృద్ధి చెందడానికి బాగా అవకాశం ఉంటుంది. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులను వాడితే మీకు మీరే ప్రమాదాన్ని కొని తెచ్చుకునే పరిస్థితి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే, ఈ ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులకు బదులుగా.. చెక్క బోర్డులను వాడడం చాలా మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులో పోలిస్తే.. చెక్క బోర్డు మీద బ్యాక్టీరియా చాలా తక్కువ వృద్ధి మాత్రమే ఉంటుంది. కాబట్టి అది మన ఆరోగ్యం అంత ప్రభావం చూపకపోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
0 Comments