చైనా వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. వరసుగా మెడల్స్ సాధిస్తూ దూసుకుపోతున్నారు. పలు విభాగాలలో పతకాలను కొల్లగొడుతున్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు జరిగిన క్రీడలలో రాణిస్తూ 32 పతకాలను సాధించారు. ఇప్పటి వరకూ గెలిచిన పతకాలలో షూటర్లదే హవా కొనసాగింది.
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ టీమ్ విభాగంలో పాలక్, ఇషా సింగ్, దివ్య తడిగోల్ బృందం రజతం సాధించారు. వ్యక్తిగత మహిళల విభాగంలోనూ పాలక్ స్వర్ణం, ఇషా సింగ్ రజత పతకాలు దక్కించుకున్నారు. దీంతో ఇప్పటివరకు షూటింగ్‌లోనే 17 పతకాలు వచ్చాయి. ఇందులో 6 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్య పతకాలు ఉన్నాయి.
ఏషియన్ గేమ్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పురుషుల విభాగంలో సరబ్‌జోత్ సింగ్, శివ నర్వాల్, అర్జున్ సింగ్ చీమా జట్టు బంగారు పతకాన్ని సాధించింది. టీమ్ ఈవెంట్‌లో భారత త్రయం 1734 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇక 1733 పాయింట్లు సాధించిన చైనా ఒక పాయింట్ తేడాతో అపజయం పాలైంది. ఇదే విభాగంలో అర్జున్ సింగ్, సరబ్‌జ్యోత్ సింగ్ టాప్ 8కి అర్హత సాధించారు. సరబ్‌జ్యోత్ 5వ ప్లేస్‌లో ఉండగా, అర్జున్ 8వ స్థానంలో నిలిచారు.
షూటింగ్‌లో భారత్ షూటర్లు అద్భుతంగా రాణించి రెండు గోల్డ్ మెడల్స్ సాధించారు. పురుషుల 50 మీటర్ల త్రీ పొజిషన్ టీమ్ ఈవెంట్‌లో స్వప్నిల్ కుశాలెల, అఖిల్ షిరన్, ఐష్వరి ప్రతాప్ సింగ్‌ల జట్టు 1769 పాయింట్లు సాధించి మొదటి స్థానం కైవసం చేసుకుని 2 గోల్డ్ మెడల్స్‌ను సాధించింది.
మరో పక్క ఏషియన్ గేమ్స్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. నేడు (శుక్రవారం) భారత్ పురుషుల జట్టు షూటింగ్‌లో స్వర్ణం సాధించారు. 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్‌లో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్, అఖిల్ షెరాన్, స్వప్నిల్ కుశాలే జట్టు బంగారు పతకాన్ని కైవశం చేసుకుంది. అంతే కాకుండా మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో ఇషా, పాలక్, దివ్య బృందం రజత పతకం సాధించింది.
ఆసియా క్రీడల్లో హైదరాబాద్‌కు చెందిన షూటర్ ఇషా సింగ్ భారత్‌కు పతకాల పంట పండించారు. బుధవారం ఒక స్వర్ణం, రజతం సాధించిన ఇషా శుక్రవారం మరో రెండు రజత పతకాలను తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ విజయంతో ఏషియన్ క్రీడల చరిత్రలో 4 మెడల్స్ సాధించిన తొలి క్రీడాకారిణిగా ఆమె సంచలన రికార్డును నెలకొల్పారు. 25 మీటర్ల పిస్టల్ టీమ్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగాలలో ఇషా సింగ్ పతకాలు గెలుచుకున్నారు. ఈ విజయాలతో ఇషాపై ప్రశంసల జల్లు వెల్లువెత్తున్నాయి. ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు.
మరోవైపు టెన్నిస్‌లో ఇప్పటివరకూ భారత్‌కు అనుకూల ఫలితాలు రాలేదు. శుక్రవారం జరిగిన డబుల్స్ ఈవెంట్‌లో రజత పతకం సాధించింది. డబుల్స్ విభాగంలో తెలుగు తేజం సాకేత్ మైనేని, రామ్‌కుమార్ రాననాథన్ జోడీ సిల్వర్ గెలుచుకుంది. ఏషియన్ గేమ్స్‌లో రామ్‌కుమార్‌కు తొలి మెడల్ కాగా, సాకేత్‌కి ఇది మూడోది కావడం విశేషం. అలాగే అందరి దృష్టి మహిళా బాక్సర్ నిఖత్ జరీన్‌పైనే ఉంది. ఆమె కూడా గెలిస్తే భారత్‌కు మరో పతకం ఖాయం. బ్యాడ్మింటన్‌లో పీవీ సింధూ, ప్రణయ్‌లు కూడా పతకాలు సాధించే అవకాశం ఉంది.
మహిళల క్రికెట్ జట్టు క్రీడల్లో హర్మన్ అడుగుపెట్టిన మొదటిసారే బంగారు పతకాన్ని సాధించి సత్తా చాటింది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని మహిళల జట్టు ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి గోల్డ్ మెడల్ సాధించింది. ఇప్పుడు పురుషుల క్రికెట్ జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని పురుషుల జట్టు చైనాకు వెళ్లింది. దీంతో స్వర్ణం సాధించి తిరిగి రావాలంటూ క్రికెట్ అభిమానులు భారత్ క్రికెట్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.
ఏషియన్ గేమ్స్ కోసం భారత పురుషుల జట్టు:
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, రాహుల్ త్రిపాఠి, జితేశ్ శర్మ (వికెట్ కీపర్) , శివం దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, షాబాజ్ అహ్మద్, ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్, అర్షదీప్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శివం మావి
స్టాండ్‌బై ప్లేయర్స్:
వెంకటేశ్ అయ్యర్, సాయి కిశోర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్, యశ్ ఠాకూర్
జాతీయ క్రికెట్ అకాడమీ టీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. భారత్ తన మొదటి మ్యాచ్‌ను అక్టోబర్ 3న ఆడనుంది. ప్రత్యర్థి టీమ్ ఎవరు అనేది ఇంకా తెలియలేదు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ర్యాంకింగ్స్ ఆధారంగా భారత జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది
0 Comments