Ad Code

Health News - మీకు వస్తోంది గ్యాస్ నొప్పా.. గుండె నొప్పా..?

ఈ రోజుల్లో మన జీవనశైలి, ఆహార అలవాట్లలో మార్పుల మూలంగా ఎక్కువగా వచ్చే అనారోగ్య సమస్యలో ప్రధానమైనది గ్యాస్ నొప్పి. గ్యాస్ వ‌ల్ల ఒక్కోసారి ఛాతిలో, గుండె దగ్గర నొప్పి వ‌స్తుంది. దీనిపై అప్ర‌మ‌త్తంగా ఉండ‌డం మంచిదే. అసలు గుండె నొప్పి ఎలా ఉంటుందో.. దాని లక్షణాలు ఎలా ఉంటాయో.. గ్యాస్ నొప్పికి, గుండె నొప్పికి మధ్య తేడా ఎలా ఉంటుందో.. దీని గురించి నిపుణులు ఏమని చెబుతున్నారో తెలుసుకుందాం.


                     

వైద్యులు ఏమంటున్నారంటే..

గుండె నొప్పి వచ్చే ముందు ఛాతిలో ఎడ‌మ వైపు నొప్పి, క‌డుపు ఉబ్బ‌రంగా ఉండడం, పుల్ల‌ని త్రేన్పులు రావడం, గుండెల్లో మంట, విపరీతమైన చెమట పడుతుంది. కొంద‌రికి వాంతులు అవుతాయి. ఈ లక్షణాలు 
వుంటే వీలైంతన త్వరగా వైద్యులను సంప్రదించడమే మంచిది. అదే గ్యాస్ నొప్పి అయితే.. కడుపులో నొప్పి, త్రేన్పులు రావడం, ఒక్కోసారి కడుపు భాగంలో గుచ్చుతున్నట్లు ఉండటం వంటివి కనపడతాయని వైద్యులు చెబుతున్నారు. అయినా స‌రే అశ్ర‌ద్ధ చేయ‌కుండా పరీక్షలు చేయించుకుంటే ఏదైనా సమస్య ఉంటే తెలిసిపోతుందని వైద్యులు సలహా ఇస్తున్నారు.

Post a Comment

0 Comments