ఇండియాలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి బంగారంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రస్తుతం ఎన్నో మార్గాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుని మీ భవిష్యత్తుని బంగారంలా మార్చుకోండి.
ఆభరణంగా: పురాతన పెట్టుబడి మార్గాల్లో ఒకటి బంగారు ఆభరణాలు కొనడం. మహిళలకు ఇవి ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఇలా బంగారు ఆభరణాలు కొనడం వల్ల కలిగే లాభం ఏమిటంటే.. కేవలం వాటిని ధరించగలం. దీనివల్ల సమాజంలో హోదా పెరుగుతుంది. కానీ, ఇలా కొనడం వల్ల ఎక్కువ లాభం ఉండదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆభరణాలను తిరిగి అమ్మాలనుకుంటే.. తరుగు వల్ల తక్కువ డబ్బు వస్తుంది. అంతేకాదు, ఆభరణాల నాణ్యత మీద నమ్మకం ఉండదు. దొంగతనం అవుతుందేమో అనే భయం కూడా వెంటాడుతుంది.
ఫిజికల్ గొల్డ్: బంగారాన్ని ముద్దలా, బార్స్‌లా లేదా కాయిన్స్‌లను ఫిజికల్ గోల్డ్ అంటారు. ఆభరణాలతో పోలిస్తే ఇలా కొనడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇందులో తరుగు వర్తించదు. కేవలం టాక్స్ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కువ నష్టం రాదు. కానీ, దొంగల భయం ఉంటుంది.
డిజిటల్ గోల్డ్: ఇది ఆన్‌లైన్ ఫిజికల్ గోల్డ్ లాగానే ఉంటుంది. దీనికి భౌతిక రూపం ఉండదు. అంటే ఆన్‌లైన్ వాలెట్‌లో బంగారాన్ని దాచుకునట్లు అనమాట. దీనికి కూడా మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని కొనడానికి మార్కెట్‌లో ఎన్నో యాప్‌లు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని మీరు డిజిటల్ గోల్డ్ పెట్టుబడి పెట్టవచ్చు. దీనిలో మీరు 99.9 శాతం నాణ్యమైన బంగారాన్ని పొందవచ్చు. దీన్ని కొనే, అమ్మే సమయాల్లో యాప్ వారికి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దొంగల భయం ఉండదు. పైగా ఇందులో కనీసం రూ.100తో కూడా పెట్టుబడి పెట్టవచ్చు.
గోల్డ్ ఈటీఎఫ్: ఈటీఎఫ్ అంటే ఎక్స్‌చెంజ్ ట్రేడెట్ ఫండ్. ఇందులో మీరు పెట్టుబడి పెట్టడానికి తప్పనిసరి డిమాట్ ఖాతా లేదా ట్రేడింగ్ ఖాతా ఉండాలి. ఇందులో కూడా మీరు బంగారాన్ని కొనవచ్చు. వాటిని గోల్డ్ ఈటీఎఫ్ అని అంటారు. ఇందులో ఎన్నో కంపెనీలు ఉంటాయి. అందులో మీకు నచ్చిన దానిలో పెట్టుబడి పెట్టవచ్చు.
గోల్డ్ మ్యూచువల్ ఫండ్: మ్యూచువల్ ఫండ్స్‌లో స్టాక్‌తో పాటు బంగారంలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. స్టాక్ మార్కెట్‌లో షేర్ లాగా మ్యూచువల్ ఫండ్స్‌లో NAV అంటే నెట్ అసెట్ వాల్యూ ఉంటుంది. మీకు నచ్చిన మ్యూచువల్ ఫండ్‌లో మీకు కావాల్సినన్ని NAVలను కొనవచ్చు. కావాల్సిన సమయంలో వాటిని అమ్మవచ్చు. దీనికి తప్పకుండా మీ దగ్గర డిమాట్ ఖాతా ఉండాలి. ఇందులో బ్రోకరేజ్ ఛార్జీలు వర్తిస్తాయి.
సావరిన్ గోల్డ్ బాండ్: పై పెట్టుబడుల్లో ఎందులో పెట్టుబడి పెట్టిన వివిధ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. కానీ, సావరిన్ గోల్డ్ బాండ్‌లో పెట్టుబడి పెడితే మాత్రం మీకు బంగారం మీదా అప్రిషియేషన్‌తో పాటు వడ్డీ కూడా లభిస్తుంది. ఇది ఒక ప్రభుత్వ పథకం. దీన్ని ఆర్బీఐ విడుదల చేస్తుంది. ఇందులో మీరు బంగారాన్ని గ్రాముల్లో కొనాల్సి ఉంటుంది. కనిష్టంగా 1 గ్రాము నుంచి గరిష్టంగా 4 కిలోల వరకు కొనవచ్చు. మీరు కొన్న బంగారం మీద సంవత్సరానికి 2.5% వడ్డీ కూడా లభిస్తుంది. దీని కాలవ్యవధి 8 సంవత్సరాలు ఉంటుంది. కానీ, ఇందులో బంగారం భౌతికంగా మన దగ్గర ఉండదు.
0 Comments