Ad Code

Business: రూపాయి ఖర్చు లేకుండా రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్

Free Health insurance


కరోనా ఎంతో మందికి కష్టాన్ని ఇచ్చింది. ఆ సమయంలో డబ్బు లేని కారణంగా ఎంతో మంది ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. దీనివల్ల హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ముఖ్యమో అందరికీ అర్థం అయింది. దీంతో అందరూ ఇన్సూరెన్స్ వైపు అడుగులు వేయడం ప్రారంభించారు. కానీ, ప్రీమియం చెల్లించలేని వారు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఇంకా వెనుకాడుతున్నారు. చాలామంది సామాన్యులు ఇప్పటికీ ఇన్సూరెన్స్ అంటే ఒక వృధా ఖర్చులా భావిస్తున్నారు. అలాంటి వారందరికీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ ఒక గొప్ప వరంగా చెప్పుకోవచ్చు. దీన్ని 2021లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. అసలు ఏంటి ఈ ఆయుష్మాన్ భారత్..? దీంతో ఏంటి లాభం..? అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆయుష్మాన్ భారత్ ఒక జాతీయ ఆరోగ్య రక్షణ పథకం. దీనిని ఉపయోగించుకుని ఇప్పటికే 5 కోట్లకు పైగా ప్రజలు లబ్ది పొందారు. ఇది సామాన్యులకు చాలా బాగా ఉపయోగపడే పథకంగా చెప్పుకోవచ్చు. దీని ద్వారా రూ.5 లక్షల వరకు కవరేజ్‌ను పొందవచ్చు. దీని కోసం ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇందులో దరఖాస్తు చేసుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి మీ స్వతహగా ఆయుష్మాన్ భారత్ అధికారిత వెబ్‌సైట్‌‌లో  https://abdm.gov.in/ లేదా ABHA యాపు డౌన్‌లోడ్ చేసుకుని.. కావలసిన డాక్యుమెంట్లు సబ్మిట్ చేసి ఆభా నంబర్ అంటే ఆయుష్మాన్ భారత్ నంబర్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదా మీ రేషన్ కార్డు,  ఐడి ప్రూఫ్ తీసుకుని మీసేవ లేదా ఆసుపత్రికి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే సమయంలో ఆధార్ కార్డు‌తో రిజిస్టర్ అయిన ఫోన్ నంబర్‌కు OTP వస్తుంది. కాబట్టి, ఆధార్ కార్డుతో ఫోన్ నంబర్ తప్పనిసరి లింక్ అయ్యి ఉండాలి.

ఈ పథకానికి అర్హులు
*భారతీయులై ఉండాలి.
*ఏ వయసు వారైన దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.
*ఏ కాటగిరీ వారైన ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
*సంవత్సర ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువ ఉన్న వారు ఈ పథకానికి అర్హులు. 

ఇందులో ఏ ఏ వ్యాధులకు చికిత్స పొందవచ్చు..
ఈ పథకం కింద 1929 వరకు చికిత్స ప్రొసిజర్లు కవర్ అవుతాయి. వీటితో పాటు తీవ్రమైన వ్యాధులు కూడా కవర్ అవుతాయి. అవేంటో ఒకసారి లుక్ వేద్దాం..

* ప్రోస్టెట్ క్యాన్సర్
* కరోనరీ అర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్
* డబల్ వాల్వే రీప్లెస్‌మెంట్
* కెరటిన్ అంగియో ప్లాస్టిక్ విత్ స్టెంట్
* పల్మోనరీ వాల్వే రీప్లెస్‌మెంట్
* స్కల్ బేస్ సర్జరీ
* అంటెరియా స్పైనక ఫిక్సేషన్
* టిష్షు ఎక్స్‌పాండర్ ఫర్ డిస్‌ఫిగ్యుర్‌మెంట్ ఫాలోయింగ్ బర్న్.

 ఏ ప్రొసిజర్స్ కవర్ కావు..
* డ్రగ్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్
* కాస్మెటిక్ ప్రొసిజర్
* OPD(అవుట్-పేషెంట్ డిపార్ట్‌మెంట్)
* ఇండివిజువల్ డయాగ్నోస్టిక్స్
* ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంటేషన్
* ఫెర్టిలిటీ రిలేటెడ్ ప్రొసిజర్స్


ఈ పథకంతో లాభం ఏంటి..?

*ఆయుష్మాన్ భారత్ పథకం కింద.. స్కీమ్‌తో లింక్ ఉన్న ఆసుపత్రికి వెళ్లి రూ.5 లక్షల వరకు కవరయ్యే చికిత్సను ఉచితంగా పొందవచ్చు.
*సధారణ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రీ ఎక్సిస్టెంట్స్ ఇల్‌నెస్‌‌లకు(అప్పటికే ఉన్న వ్యాధులకు) చికిత్స పొందడానికి కొంత సమయం వేచి ఉండాల్సి ఉంటుంది. కానీ, ఈ పథకంలో అలా కాదు. మీకు ప్రస్తుతం ఉన్న ఏ వ్యాధికైనా ఈ పథకంలో చేరిన తర్వాత చికిత్స పొందవచ్చు.
*3 రోజుల వరకు ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్‌పెన్సెస్‌( హాస్పిటల్‌లో చేరక ముందు అయిన చికిత్స ఖర్చు) లభిస్తుంది.
*15 రోజుల వరకు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్‌పెన్సెస్( హాస్పిటల్‌లో చేరిన తర్వాత జరిగే చికిత్స ఖర్చు) లభిస్తుంది.
* ఇది పూర్తిగా క్యాష్‌లెస్ ఇంక పేపర్ లేస్ ప్రక్రియ. అంటే మీరు ఈ పథకంతో లింక్ అయ్యి ఉన్న ఆసుపత్రులకు వెళ్లి.. ABHA నంబర్‌తో చికిత్స పొందవచ్చు. దీనికి ఎలాంటి డబ్బు చెల్లింపులు గాని, కాగిదాలు గాని అవసరం లేదు.

ఈ స్కీమ్‌తో లింక్ అయ్యి ఉన్న ఆసుపత్రీలు ఏవో తెలుసుకోండిలా..


*ఆయుష్మాన్‌ భారత్ స్కీమ్‌లోని నెట్‌వర్కింగ్ హాస్పిటల్లను కనుగొనడానికి PMJAY.GOV.IN వెబ్‌సైట్‌కి వెళ్ళాలి.
*అందులో ఫైయిండ్ హాస్పిటల్‌ ఆప్షన్‌ని ఎంచుకోండి.
*తర్వాత వచ్చిన ఫార్మ్‌లో అన్ని వివరాలు నింపి.. కాప్చ ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. ఆసుపత్రీల గురించి మీకు పూర్తి వివరాలు వాస్తాయి.

ముఖ్యమైన విషయాలు
ఇందులో కేవలం రూ.5 లక్షల వరకు మాత్రమే చికిత్స పొందగలరు. అంతకంటే ఎక్కువ ఖర్చు అయ్యే చికిత్స కోసం మీరే డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ రూపాయి ఖర్చు లేకుండా దొరికే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ లాంటిది. కానీ, ఈరోజుల్లో ఇంత తక్కువ కవరేజ్ సరిపోదు. కాబట్టి, మీరు ప్రీమియం చెల్లించగలిగితే ఎక్కువ కవరేజ్ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్‌ మరోకటి తప్పకుండా తీసుకోండి.

Helpline: మీకు ఈ పథకం గురించి ఇంకేమైన వివరాలు కావాలనుకుంటే.. ఈ పథకానికి సంబంధించిన 1800111565 హెల్ప్ లైన్ నెంబర్‌కి కాల్ చేసి కనుకోవచ్చు.

Post a Comment

0 Comments