ఇటీవల జరిగిన ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మొదటి రెండు మ్యాచ్‌లు ఆడలేదు. మూడో మ్యాచ్‌లో ఆడిన రోహిత్ శర్మ 81 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 56 పరుగులు చేశారు. మరో ప్లేయర్ హార్దిక్ పాండ్యా మూడో మ్యాచ్‌కి కూడా దూరం అయ్యారు. ఇలా సరిగా ప్రాక్టీస్ లేకుండానే టోర్నీలో టీమిండియా ఆటగాళ్లు ఎలా రాణిస్తారని ఓ పక్క అభిమానుల్లో సందేశం నెలకొంది. అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే వరల్డ్ కప్ టోర్నీకి ఇంకా మూడు రోజులే మిగిలి ఉంది.
ఈ నెల 5 నుంచి భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ మెగా టోర్నీ జరగనుంది. దీంతో కప్ నెగ్గేది ఎవరు అనే ప్రశ్న మొదలయ్యింది. ఇటీవల జరగిన ఆసియా కప్‌లో టీమిండియా బాగా రాణించింది. శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో 10 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఇక టీమిండియా ప్లేయర్లు మంచి ఫామ్‌లో ఉండటంతో వన్డే వరల్డ్ కప్ కూడా మనదే అంటూ భారత్ క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు. 1975 నుంచి వన్డే వరల్డ్ కప్ జరుగుతుంది. ఇప్పుడు భారత్ వేదికగా జరిగేది 13వ ఎడిషన్. అయితే భారత్ ఇప్పటి వరకూ రెండు సార్లు వన్డే వరల్డ్ కప్ గెలిచింది. 1983లో కపిల్ దేవ్ నేతృత్వంలో మొదటిసారిగా వరల్డ్ కప్‌ని నెగ్గింది. మళ్లీ 28 సంవత్సరాల తర్వాత మహేంద్రసింగ్ ధోనీ నేతృత్వంలో భారత్ వేదికగా జరిగిన టోర్నీలో రెండోసారి వరల్డ్ కప్‌ని టీమిండియా ముద్దాడింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ధోనీ కొట్టిన సిక్స్ క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ మధర క్షణం అది.
వరల్డ్ కప్ ఆడుతున్న జట్లు
అక్టోబర్ 5 నుంచి జరిగే వన్డే వర్డల్ కప్‌లో 10 జట్లు తలపడనున్నాయి. భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్ వరల్డ్ కప్‌కు అర్హత సాధించాయి. ప్రతి జట్టు మిగిలిన 9 జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. టాప్-4లో ఉండే జట్లు సెమీ ఫైనల్స్‌కు వెళ్తాయి. నవరంబర్ 15న సెమీ ఫైనల్-1, నవంబర్ 16న సెమీ ఫైనల్-2, నవంబర్ 19న (అహ్మదాబాద్‌లో) ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
టీమిండియా తలబడే జట్లు
తేదీ |
టీమ్స్ |
వేదిక |
|
భారత్ vs ఆస్ట్రేలియా |
ఎమ్.ఏ. చిదంబరం స్టేడియం, చెన్నై |
|
భారత్ vs ఆప్ఘనిస్తాన్
|
అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ |
అక్టోబర్ 14, శనివారం
|
భారత్ vs పాకిస్థాన్
|
నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్ |
అక్టోబర్ 19, గురువారం |
భారత్ vs బంగ్లాదేశ్ |
మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణే |
|
భారత్ vs న్యూజిలాండ్ |
హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, ధర్మశాల |
అక్టోబర్ 29, ఆదివారం
|
భారత్ vs ఇంగ్లాండ్
|
భారత్ రత్నా శ్రీ అటల్ బిహారి వాజ్‌పేయి ఏక్‌నా స్టేడియం, లక్నో |
నవంబర్ 02, గురువారం
|
భారత్ vs శ్రీలంక |
వాంఖడే స్టేడియం, ముంబాయ్ |
నవంబర్ 05, ఆదివారం |
భారత్ vs సౌత్ ఆఫ్రికా |
ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా |
నవంబర్ 12, ఆదివారం |
భారత్ vs నెథర్లాండ్స్ |
ఎమ్. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు |
0 Comments