Ad Code

70th National Film Awards: నేషనల్ ఫిలిం అవార్డు గెలుచుకున్న ఇండియన్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్

 

 నేషనల్ ఫిలిం అవార్డు గెలుచుకున్న మన తెలుగు ఇండియన్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్

తమిళ్ హీరో ధనుష్ నటించిన తిరుచిత్రంబలం (తిరు) అనే మూవీ కి నృత్యం సమకూర్చినందుకు గాను జానీ మాస్టర్ గారికి నేషనల్ అవార్డం ఇవ్వడం జరిగింది. ఈ మూవీ 2022 విడుదలై హిట్ గా నిలిచింది, ఆర్ మిత్రన్ దర్శకత్వం వహించారు , 2022 సంవత్సరంలో విడుదలైన సినిమాలో చెప్పుకోదగ్గ సినిమాలు లేని సమయంలో  ఈ మూవీ విడుదలై అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీ కి రెండు జాతీయ పురస్కారాలు రావడం విశేషం.

మేఘం కురిసేనే అనే పాటకు నృత్య దర్శకత్వం వహించిన ఇండియన్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మరియు సతీష్ కృష్ణన్ కు జాతీయ అవార్డు దక్కింది. కొంతమంది ఇన్ఫ్లుఎంసెర్స్ (influencers) ఈ పాటను ఇంస్టాగ్రామ్ రీల్స్ ఎక్కువగా చేయడం వలన ఇది చాలా ఎక్కువ దృష్టిని ఆకర్షించింది.

70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఈ మూవీ కి ఉత్తమ నృత్యదర్శకునిగా మన తెలుగు డాన్స్ మాస్టర్ జానీ గారికి రావడం మన తెలుగు ప్రజలు చాల గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఉన్న ఇండియా డాన్స్ మాస్టర్ లో జానీ మాస్టర్ మొదటిస్థానంలో ఉండటం విశేషం, ఇప్పుడు ఉన్న ఇండియా సినిమాటోగ్రాఫర్‌లలో అత్యంత బిజీగా ఉన్న మాస్టర్ లో   జానీ మాస్టర్ ఒకరు. ముఖ్యంగా ఈ మూవ్ ని హిట్ చేయడంలో ఈ పాట ఎంతో దోహదపడింది అని చెప్పవచ్చు. 

ఈ మూవీ కి గాను రెండో జాతీయ అవార్డు అందుకున్న వ్యక్తి నిత్యామీనన్ గారు, ఈ మూవీ కి గాను ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు.

కొంతమంది సెలెబ్రెటీస్ విషెస్
        

Post a Comment

0 Comments